
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి భారీ వసూళ్లను సాధిస్తోంది. జనవరి 12 న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం 54 కోట్ల భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. అయితే జనవరి 13 న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య రిలీజ్ కావడంతో వీరసింహా రెడ్డి చిత్రానికి తక్కువ థియేటర్స్ మాత్రమే లభించాయి. దాంతో రెండో రోజు నుండి వసూళ్లు తగ్గాయి.
ఇక జనవరి 14 న విజయ్ నటించిన వారసుడు చిత్రం కూడా విడుదల కావడంతో మరిన్ని థియేటర్లు తగ్గాయి దాంతో వీరసింహారెడ్డికి తక్కువ థియేటర్లు మాత్రమే మిగిలాయి దాంతో మరిన్ని వసూళ్లు తగ్గాయి. అయినప్పటికీ బాలయ్య జోరును మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. మొత్తంగా 5 రోజుల్లో 117 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు బాలయ్య.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ , శృతి హాసన్ , హానీ రోజ్ , అన్నపూర్ణ , రాజీవ్ కనకాల , దునియా విజయ్ , నవీన్ చంద్ర తదితరులు నటించారు. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ , ఫైట్స్ అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఈ చిత్రానికి చాలా హెల్ప్ అయ్యింది. మొత్తానికి బాలయ్య సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.