నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” వీరసింహారెడ్డి ”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా 12 జనవరి 2023 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజునే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అలాగే భారీ ఓపెనింగ్స్ ను సాధించింది.
జనవరి 12 న విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది దాంతో 50 రోజుల పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక తనకు ఇంతటి మహత్తర అవకాశాన్ని అందించిన నందమూరి బాలకృష్ణకు కృతఙ్ఞతలు తెలిపాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. కమర్షియల్ సినిమాలకు దర్శకత్వం వహించాలని ఆశపడే దర్శకులకు బాలయ్య మంచి ఛాయిస్ . దాంతో తనకు అంతటి గొప్ప అవకాశం లభించడంతో అది సద్వినియోగం అవ్వడంతో చాలా చాలా సంతోషంగా ఉన్నాడు గోపీచంద్ మలినేని.
బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా హానీ రోజ్ , శృతి హాసన్ ఇద్దరు కూడా బాలయ్య సరసన నటించారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. తమన్ అందించిన పాటలు , నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో లెవల్ లో నిలబెట్టాయి. తమన్ అందించిన రీ రికార్డింగ్ ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. వీరసింహారెడ్డి 50 రోజులను పూర్తి చేసుకోవడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.