నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రముఖ ఓటీటీ పార్ట్ నర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అలా స్ట్రీమింగ్ కి రావడమే ఆలస్యం ఇలా వైరల్ గా మారింది. వీరసింహారెడ్డి చిత్రం ను థియేటర్ లలో చూడని వాళ్ళు , అలాగే చూసిన వాళ్ళు సైతం మళ్ళీ మళ్ళీ చూడాలని ఉత్సాహంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చేస్తున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 న భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇక భారీ ఓపెనింగ్స్ వచ్చాయి ఈ చిత్రానికి. మొదటి రోజున 54 కోట్ల రూపాయలను ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసి సంచలనం సృష్టించింది.
ఓవరాల్ గా 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించాడు. బాలయ్య గెటప్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ సీన్స్ తో పాటుగా పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వీరసింహా రెడ్డి చిత్రం విడుదలై 50 రోజులు కూడా కాకుండానే OTT లోకి వచ్చేసింది. దాంతో నందమూరి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. బాలయ్య నటించిన రెండు చిత్రాలు అఖండ , వీరసింహారెడ్డి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో మరింత సంతోషంగా ఉన్నారు.