నటసింహం నందమూరి బాలకృష్ణ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. బాలయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో సమయానికి గ్రహించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ఒంగోలుకు మళ్లించాడు . సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ లో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో పడ్డారు.
అసలు విషయం ఏమిటంటే…… ఒంగోలులో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ కు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో వెళ్ళాడు బాలయ్య. నిన్న రాత్రి ఈవెంట్ ను పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్ కు బయలు దేరాడు. అయితే ఒంగోలు నుండి టేకాఫ్ తీసుకొని కొంత దూరం ప్రయాణించిన తర్వాత హెలికాప్టర్ లో సాంకేతిక లోపం గుర్తించాడు పైలట్. దాంతో ముందుకు ప్రయాణించడం కష్టమని భావించిన పైలట్ హెలికాప్టర్ ను మళ్లీ ఒంగోలుకు తరలించాడు. దాంతో బాలయ్య సేఫ్ గా ఒంగోలు లో దిగాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు , దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.