
నర్సులకు సారీ చెప్పాడు బాలయ్య. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసే నర్సులంటే నాకెంతో గౌరవం ….. నా వ్యాఖ్యలను వక్రీకరించారని …… అయినప్పటికీ నా వ్యాఖ్యలు ఇబ్బంది కరంగా అనిపిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ఓ లేఖ విడుదల చేసారు బాలయ్య.
ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోలో నర్సులపై వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ నాకు ఒకసారి బైక్ యాక్సిడెంట్ జరిగిందని ….. ఆ సమయంలో హాస్పిటల్ కు వెళితే దానమ్మ…. ఆ నర్స్ ఏమో అందంగా ఉంది అంటూ నోరు జారాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో బాలయ్య పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిపడుతున్నాయి. దాంతో ఇలా లేఖ విడుదల చేశాడు. బాలయ్య సారీ చెప్పాడు కాబట్టి వివాదం సద్దుమణిగిందనే చెప్పాలి.