
నటసింహం నందమూరి బాలకృష్ణ మంచి జోరు మీదున్నాడు. ఒకవైపు గ్యాప్ ఇవ్వకుండా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇదే సమయంలో ఆహా కోసం అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నాడు. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ కూడా చేస్తున్నాడు. ఇక రెండో సీజన్ కూడా అన్ స్టాపబుల్ గా సాగుతోంది.
అయితే ఈ రెండో సీజన్ ముగింపు దశకు రావడం ఇక ఇదే సమయంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 కూడా ముగియడంతో ఆ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కింగ్ నాగార్జున దిగ్విజయంగా 4 బిగ్ బాస్ షోలను రన్ చేసాడు. ఇక మిగిలిన రెండు షోలకు ఎన్టీఆర్ , నాని హోస్ట్ గా వ్యవహరించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో రేటింగ్స్ సాధించలేకపోయింది. దాంతో తదుపరి సీజన్ కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తే బ్లాక్ బస్టర్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బాలయ్య వీరసింహా రెడ్డి చిత్రం పూర్తి చేసాడు. అయితే ఒక పాట బ్యాలెన్స్ గా ఉంది దాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక ఇదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ కావడానికి చాలా సమయం ఉంది కాబట్టి ఆలోపు చర్చలు ఫలవంతం అయితే …….. బాలయ్య దిగితే ……. దబిడి దిబిడే !