నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో కలిసి పోతున్నాడు. ఇక సదరు యంగ్ హీరోలు కూడా ఇన్నాళ్లు బాలయ్య అంటే భయపడేవాళ్లు కానీ బాలయ్య అంతరంగం ఏంటో తెలిసిన కుర్ర హీరోలు ” జై బాలయ్య ” అంటూ బాలయ్య కు దగ్గర అవుతున్నారు. ఇందుకు బాలయ్య షో ” అన్ స్టాపబుల్ ” కూడా ఎంతగానో దోహదపడింది అనే చెప్పాలి.
ఇక తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన ” హిట్ – 2 ” చిత్రం విడుదల కాగా ఆ సినిమాకు సాలిడ్ గా హిట్ టాక్ వచ్చింది. ఆ సినిమాను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. దాంతో నాని , అడవి శేష్ ఇద్దరు కూడా బాలయ్య కు స్పెషల్ షో వేశారు. ఆ సినిమా చూసిన బాలయ్య నాని ని అలాగే అడవి శేష్ ని కూడా అభినందించాడు. దాంతో నాని , అడవి శేష్ ఇద్దరు కూడా సంతోషించారు అంతేకాదు …… బాలయ్య తో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గ హిట్ – 2 చిత్రాన్ని చేసారు. హిట్ 1 లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో మాత్రం అడవి శేష్ హీరోగా నటించాడు. డిసెంబర్ 2 న విడుదలైన ఈ చిత్రానికి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో హిట్ 3 చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.