
నటసింహం నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు , నారా లోకేష్ భార్య అయిన బ్రాహ్మణి తాజాగా బైక్ రైడింగ్ లో అదరగొట్టింది. హిమాలయాల్లోని లదాక్ నుండి లెహ్ వరకు బైక్ రైడింగ్ చేసి సంచలనం సృష్టించింది. సాధారణ రోడ్డులో ప్రయాణించడం అంటే వేరు …… కానీ అసాధారణ రోడ్డులో ప్రయాణించడం మాములు విషయం కాదు. కానీ సాహసానికి మారు పేరు నందమూరి వంశం కాబట్టి బాలయ్య కూతురు ఈ సాహసానికి పూనుకుంది.
బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి ఒక తల్లిగా , కోడలిగా , భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే హెరిటేజ్ సంస్థ బాధ్యతలను నెరవేరుస్తోంది. అలాగే తన అభిరుచి మేరకు బైక్ రైడింగ్ కూడా చేస్తుండేదట. అలా బైక్ రైడింగ్ చేసే అలవాటు కాస్త సాహసయాత్ర చేయడానికి దారి తీసింది. ప్రముఖ బైక్ అయిన జావా ఎజ్డీ ఈ సాహసయాత్ర చేసే వాళ్లకు అండగా నిలిచింది. దాంతో బాలయ్య కూతురు బ్రాహ్మణి పేరు మారుమ్రోగుతోంది.