నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ” సింహా ”. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2010 లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. మళ్ళీ బాలయ్యకు తిరుగులేని బ్లాక్ బస్టర్ ని అందించింది సింహా చిత్రమే. అలాంటి ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా నయనతార , నమిత , స్నేహ ఉల్లాల్ హీరోయిన్ లుగా నటించారు. డాక్టర్ పాత్రలో బాలయ్య అభినయం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక చక్రి అందించిన పాటలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
బాలయ్య – బోయపాటి కాంబినేషన్ కు శ్రీకారం చుట్టింది ” సింహా ” సినిమానే. సింహా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత లెజెండ్ చేసారు. 2014 లో వచ్చిన లెజెండ్ రికార్డుల మోత మోగించింది. దాంతో ముచ్చటగా మూడోసారి అఖండ చిత్రం చేసారు. ఈ సినిమా కూడా గత ఏడాది విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడేమో అఖండ 2 కు కూడా రెడీ అవుతున్నారు బాలయ్య – బోయపాటి.
బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ కు శ్రీకారం చుట్టింది సింహా చిత్రమే కాబట్టి ఈ చిత్రాన్ని ఇప్పుడు మరోసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 11 న భారీ ఎత్తున విడుదల కానుంది సింహా. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ మళ్ళీ విడుదల చేయడం భారీ వసూళ్లను సాధించడం చూస్తున్నాం. ఆ కోవలోనే సింహా వస్తోంది.