నటుడు , నిర్మాత బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నం కు ప్రయతించాడట ! అయితే సమయానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి ఆదుకున్నాడని అందుకే ఇక జీవితాంతం అన్న గెలుపు కోసం ప్రయత్నిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించడం విశేషం.
టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించాడు. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రాంచరణ్ , అల్లు అర్జున్ తదితర హీరోలతో సినిమాలను నిర్మించాడు. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ డేట్స్ ఇస్తాడేమో అని చాలాకాలం నుండి ఎదురు చూస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ నుండి మాత్రం పిలుపు రావడం లేదు దాంతో దేవర మీద కోపం వచ్చింది బండ్ల గణేష్ కు.
ఇక సినిమాల్లోనే కాదు రాజకీయాలలోకి కూడా దిగాడు బండ్ల. కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో పోటీ చేయాలనీ గట్టి ప్రయత్నాలే చేసాడు. అయితే టికెట్ దక్కలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని , గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు అప్పట్లో. ఆ తర్వాత రాజకీయాలను వదిలేసి 7 ఓ క్లాక్ బ్లేడ్ అంటే భయపడిపోతున్నాడు. ఇక ఆత్మహత్య విషయానికి వస్తే ……. గతకొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు బండ్ల దాంతో ఆ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడట. సరిగ్గా అదే సమయంలో ఎంపీ రంజిత్ రెడ్డి ఆదుకోవడంతో రంజిత్ రెడ్డి అన్న నాదేవుడు అంటూ పొగుడుతున్నాడు అదన్న మాట అసలు విషయం.