నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి బండ్ల గణేష్ అనే విషయం తెలిసిందే. తరచుగా ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ చేయడం , దుమారం రేపడం సర్వసాధారణమైపోయింది. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేసే బండ్ల ఇటీవల కాలంలో రవితేజ జపం చేస్తున్నాడు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.
తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. మోసం చేయాలనుకునేవాడు మేధావిలా నటిస్తాడు. వంచించాలని అనుకునే వాడు గురువులా నటిస్తాడు. నిజాయితీగా ఉండేవాడు….. ఎప్పుడూ భక్తుడిగానే ….. పొగరుగానే ఉంటాడు. అది మీకు నచ్చినా …… నచ్చక పోయినా అనే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతకొంత కాలంగా దర్శకుడు త్రివిక్రమ్ మీద చాలా కోపంగా ఉన్నాడు బండ్ల గణేష్. ఎందుకంటే తన దేవర అయిన పవన్ కళ్యాణ్ కు తనకు మధ్యలో అడ్డుగా ఉన్నది త్రివిక్రమ్ అని భావిస్తున్నాడు. అంతేకాదు తనని కలవకుండా , తనకు సినిమా చేయకుండా అడ్డు పడుతున్నాడని చాలా రోజులుగా త్రివిక్రమ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు బండ్ల. దాంతో ఇప్పటి ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు త్రివిక్రమ్ ను విమర్శిస్తున్నావు కదా అంటూ బండ్ల ను అడుగుతున్నారు. కానీ బండ్ల గణేష్ మాత్రం వాటికి సమాధానం ఇవ్వడం లేదు.