
పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే భక్తుడు బండ్ల గణేష్. అయితే గతకొంత కాలంగా బండ్ల గణేష్ వైఖరిలో మార్పు వచ్చింది. తరచుగా సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్ లను పెడుతున్నాడు. ఆ ట్వీట్ లను చూస్తుంటే తన దేవర ( అంటే పవన్ కళ్యాణ్ ) మీద కోపంతోనే …… అసంతృప్తితోనే ఇలా చేస్తున్నాడా ? అనే అనుమానం కలుగుతోంది.
పవన్ కళ్యాణ్ వల్లే బండ్ల గణేష్ నిర్మాత అయ్యాడు. ఒకటి కాదు రెండు సినిమాలు చేసాడు పవన్ కళ్యాణ్. తీన్ మార్ , గబ్బర్ సింగ్ అనే రెండు చిత్రాలు బండ్ల గణేష్ కు చేసాడు పవన్ కళ్యాణ్. అయితే తీన్ మార్ ప్లాప్ కాగా గబ్బర్ సింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే అప్పటి నుండి మళ్ళీ తనకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డేట్స్ ఇవ్వడమే లేదు. ఇన్నాళ్లు కనీసం పవన్ కళ్యాణ్ ను కలవడానికి , చూడటానికి , మాట్లాడటానికి అవకాశం ఉండేది బండ్ల గణేష్. గతకొంత కాలంగా దర్శకులు త్రివిక్రమ్ వల్ల బండ్ల గణేష్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ డేట్స్ పక్కన పెడితే కనీసం దగ్గరకు కూడా రానీయడం లేదు. దాంతో త్రివిక్రమ్ మీద బండ్ల గణేష్ కు చాలా కోపం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా తనని పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు అందుకే సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్ లు పెడుతూ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు.
ఎలుక రాతిదైతే పూజిస్తాం ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం
పాము రాతిదైతే పాలు పోస్తాం
ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం.
తల్లిదండ్రుల ఫోటోకు దండేసి
దండం పెడతాం.ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టించుకోము,
చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం.బ్రతికున్నప్పుడు
గేటు దగ్గరకు వస్తె అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం— BANDLA GANESH. (@ganeshbandla) February 2, 2023