టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత ను ప్రేమించి పెళ్లి చేసుకొని 18 సంవత్సరాలు అయ్యింది. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం 2005 ఫిబ్రవరి 10 న ముంబైలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు మహేష్ – నమ్రత. అత్యంత నాటకీయంగా మహేష్ – నమ్రత ల పెళ్లి జరిగింది. అసలు మహేష్ బాబు – నమ్రత ల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా ?
మహేష్ బాబు – నమ్రత లు కలిసి వంశీ అనే సినిమాలో జంటగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించాడు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే షూటింగ్ సమయంలో మహేష్ బాబు – నమ్రత చాలా క్లోజ్ అయ్యారు. దాంతో వాళ్ళ ప్రేమ వ్యవహారం కృష్ణకు తెలిసింది. అలాగే మహేష్ అమ్మమ్మ కు కూడా తెలిసింది.
ఇటు కృష్ణ అటు మహేష్ అమ్మమ్మ కు నమ్రతను ప్రేమించడం అస్సలు ఇష్టం లేదు. అందుకే పెళ్లి చేసుకుంటాను అని మహేష్ చెప్పినప్పుడు వ్యతిరేకించారు. ఇంట్లో వాళ్ళను ఒప్పించాలని మహేష్ గట్టి ప్రయత్నాలే చేసాడు కానీ కుదరలేదు. దాంతో దర్శకులు జయంత్ సి. పరాంజీ సహకారంతో ముంబైలో రహస్యంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయం చివరి నిమిషంలో కృష్ణ కు తెలిసింది.
పట్టరాని ఆవేశంతో ఊగిపోయాడట. కానీ కొడుకు ఇష్టాన్ని కాదనలేక హుటాహుటిన ముంబైకి వెళ్ళాడు కృష్ణ. అక్కడ చాలా సింపుల్ గా మహేష్ – నమ్రత ల పెళ్లి అయ్యింది. వాళ్ళను ఆశీర్వదించి వెంటనే హైదరాబాద్ వచ్చేసాడు. మహేష్ బాబు నమ్రత ను పెళ్లి చేసుకున్నాడని అమ్మమ్మ పెద్ద గోల గోల చేసిందట. అయితే ఆ గొడవలు కొన్నాళ్లే ! ఎందుకంటే నమ్రత ఎంతటి తెలివి తేటలు కలదో కొన్నాళ్లకే అందరికీ తెలిసాయి.
కుటుంబం కోసం సినిమాలను పక్కన పెట్టి ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ మహేష్ సంపాదిస్తున్న సొమ్మును వెయ్యి రేట్లు పెరిగేలా రకరకాల రంగాలలో పెట్టుబడులు పెట్టింది నమ్రతనే ! అలాగే ఈరోజు వేలాది కోట్లకు యజమాని మహేష్ బాబు అంటే అదంతా కూడా నమ్రత ప్లానింగ్ మాత్రమే అని చెప్పొచ్చు. నమ్రత పద్ధతులు , అలాగే తెలివిగా ఎలాంటి రంగాలలో పెట్టుబడులు పెడితే అవి మనకు ప్రయోజనం చేకూర్చుతాయో చెప్పేలా చేసింది.