మోహన్ బాబును చూసి ఏడ్చింది భూమా మౌనిక రెడ్డి. ఈ సంఘటన పెళ్లి వేడుకలో ఒక్క క్షణం తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యేలా చేసింది. పెళ్లి కూతురు సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి ? అని షాక్ అయ్యారు పెళ్లికి హాజరైన వాళ్ళు. మోహన్ బాబును పట్టుకొని ఏడ్చిన భూమా మౌనిక రెడ్డిని ఓదార్చాడు మోహన్ బాబు. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.
అయితే మోహన్ బాబును పట్టుకొని ఏడవడానికి కారణం ఏంటో తెలుసా ……. మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి లది ప్రేమ వివాహం పైగా ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కూడా. దాంతో మనోజ్ కు మౌనిక కు ఇష్టమే కానీ మోహన్ బాబుకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదని ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఈ పెళ్లి వేడుకలో మోహన్ బాబు పాల్గొనలేదు దాంతో మరింతగా ఈ వార్తలు ఎక్కువయ్యాయి.
సరిగ్గా అలాంటి సమయంలోనే వచ్చాడు మోహన్ బాబు. తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు. మోహన్ బాబును చూడగానే భూమా మౌనిక రెడ్డి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. దాంతో మోహన్ బాబును పట్టుకొని ఉద్వేగానికి లోనయ్యింది. మంచు మనోజ్ – భూమా మౌనిక లను ఆశీర్వదించి తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు మోహన్ బాబు. మార్చి 3 న రాత్రి 8. 30 నిమిషాలకు ఫిలిం నగర్ లోని మంచు లక్ష్మీ ఇంట్లో ఈ పెళ్లి జరిగింది.