
ఈసారి దసరా పండగ బ్లాస్ట్ అయ్యేలా కనిపిస్తోంది. పండగనాటికి బాక్సాఫీస్ పై భారీ మూవీలు దండెత్తబోతున్నాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు పెద్ద సినిమాలకు బరిలోకి దిగబోతున్నాయి. చూడబోతే ఈసారి పెద్ద విధ్వసం తప్పేలా లేదు. సినిమాల లిస్టు చూస్తేనే ఆ విషయం తెలిసిపోతోంది. లైగర్ మూవీ తర్వాత కచ్చితంగా బిగ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. సమంత వంటి క్రేజీ బ్యూటీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ ముహూర్తం పెట్టేసుకుంది. వచ్చ సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్నట్టు మూవీ టీం అనౌన్స్ చేసింది. దీంతో పండగ సంతోషం అప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది అభిమానులకు.
మరోవైపు హెవీ ఎక్స్ పెషన్స్ ఉన్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో మూవీ కూడా ఇదే టైం సెట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ… సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సో దసరాకి బాలయ్య దబిడిదిబిడి పక్కా అని తెలుస్తోంది. ఇక దసరా తర్వాత నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో తన 30 వ సినిమా చేయబోతున్న నేచురల్ స్టార్ నానీ.. కూడా ఈ సారి దసరాకే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ కూడా అప్పటికే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఆలోవర్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ.. సలార్ మూవీ కూడా ఈ ఫెస్టివల్ కే సిద్దమవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కావడంతో దీనిపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నలుగురు యుద్ధవీరులు బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతుండటంతో.. ఇప్పటి నుంచే ఫిల్మ్ నగర్ స్టార్ వార్ గురించి బిగ్ డిబేట్ నడుస్తోంది. అయితే పోటీ అంతా బాలయ్య- ప్రభాస్ మధ్య జరగుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.