
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా చిత్రాన్ని తాజాగా మళ్ళీ విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 23 న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్బంగా బిల్లా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2009 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యువి కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
అందాల భామలు అనుష్క , నమిత , హన్సిక అందాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అనుష్క యాక్షన్ తోనే కాకుండా తన అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఇక భారీ అందాల తార నమిత అందాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. హన్సిక ఉంది కొద్దిసేవు అయినప్పటికీ తన గ్లామర్ తో అలరించింది.
4 K రిసొల్యూషన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సందర్బంగా కొత్త ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ డార్లింగ్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఇక అక్టోబర్ 23 న బిల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా నటించడం విశేషం.