నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార 70 కోట్ల క్లబ్ లో చేరింది. ఆగస్టు 5 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా ఆగస్టు 5 న విడుదలైంది. జూన్ , జూలై రెండు నెలల పాటు టాలీవుడ్ లో వచ్చిన పలు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి. దాంతో టాలీవుడ్ చతికిలబడింది.
సరిగ్గా అలాంటి సమయంలోనే విడుదలైన బింబిసార టాలీవుడ్ కు ఊపిరిలూదింది. కేవలం ఈ సినిమాని 16 కోట్లకు మాత్రమే అమ్మారు. ఈ సినిమాని కొన్న బయ్యర్లకు ఇప్పటికే 35 కోట్ల లాభం వచ్చింది, అంటే పెట్టిన డబ్బులకు డబుల్ కంటే ఎక్కువగా వచ్చాయి. దాంతో ఇంత భారీ లాభాలు చవిచూసిన సినిమా గతకొంత కాలంగా ఏది లేదంటే నమ్మండి. బింబిసార భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ ని 35 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది బింబిసార. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడు వశిష్ఠకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఏకంగా నటసింహం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేసే ఛాన్స్ లభించింది వశిష్ఠకు. బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వసూళ్లు సాధించేలా కనబడుతోంది. లాంగ్ రన్ లో మరో 10 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు కనబడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Breaking News