అతిలోకసుందరి శ్రీదేవి మరణించి అప్పుడే ఐదేళ్లు కావస్తోంది. 2018 ఫిబ్రవరిలో దుబాయ్ లో ఓ వేడుకకు హాజరు కావడానికి కుటుంబ సమేతంగా వెళ్ళింది. దుబాయ్ లో జరిగిన ఆ ఫంక్షన్ లో పాల్గొని తన హోటల్ గదికి వెళ్ళింది. అంతే బాత్రూంకు వెళ్లిన శ్రీదేవి మళ్ళీ తిరిగి రాలేదు. బాత్ రూంలోనే విగతజీవిగా మారింది. ఈ సంఘటన 2018 ఫిబ్రవరి 24 న జరిగింది.
రేపటికి ఈ సంఘటన జరిగి ఐదేళ్లు దాంతో తన భార్యను తల్చుకుంటూ ఆమె చివరిసారిగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు భర్త బోనీ కపూర్. కల్మషం లేని నవ్వు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు బోనీ. దాంతో నెటిజన్లు ఆమె చనిపోయినా …… మా మనస్సులో చిరస్థాయిగా ఉంది …… ఉంటుంది అని అంటున్నారు.
శ్రీదేవి తన బంధువులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. మరణానికి కొన్ని గంటల ముందు ఇలా నవ్వుతూ ఫోటోలకు ఫోజిచ్చింది. అయితే కొంత సమయానికే అర్దాంతరంగా తనువు చాలించింది దాంతో ఆమె మరణాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. నిర్మాత బోనీ కపూర్ కు అంతకుముందే పెళ్లి అయినప్పటికీ శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక బోనీ కపూర్ కు పెళ్లి అయ్యిందని తెలిసే అతడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.