2023 సంక్రాంతి పోరు రసవత్తరంగా సాగనుంది. సంక్రాంతి అంటేనే విపరీతమైన పోటీ ఉంటుంది. తెలుగువాళ్ళకు పెద్ద పండగ పైగా చాలా ఇష్టమైన పండగ దాంతో పాఠశాలలకు పెద్ద ఎత్తున సెలవులు కూడా ఇస్తుంటారు. ఇంకేముంది సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలను చూసేవాళ్ళు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు అభిరుచి మారింది అయినప్పటికీ సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువగానే ఉన్నారు. దాంతో సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీ పడుతుంటాయి.
ఇక తెలుగునాట గత 35 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి , నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉన్నారు. ఇద్దరు కూడా మాస్ హీరోలు కావడంతో అభిమానుల మధ్య తీవ్ర పోటీ ఉండేది. నువ్వా – నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పోటీ ఈతరంలో కూడా కొనసాగిస్తున్నారు బాలయ్య – చిరు.
తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి , చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా 2023 సంక్రాంతి రేసులో దూసుకు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల అవుతాయా ? లేక ఒకరోజు తేడాతో విడుదల అవుతాయా ? అనే టెన్షన్ నెలకొంది. అలాగే బాక్సాఫీస్ వార్ లో విజయం సాధించేది ఎవరు ? అనే టెన్షన్ కూడా నెలకొంది. ఇద్దరు కూడా మాస్ లో తిరుగులేని హీరోలు కావడం పైగా ఈ రెండు సినిమాలు కూడా ఊర మాస్ సినిమాలు కావడంతో విజయం మాదంటే ….. మాదే అని కసిగా ఉన్నారు అభిమానులు. అయితే ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి కానీ ఇంకా అధికారికంగా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.