క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ హాట్ భామ అనసూయ పై సెటైర్ వేసాడు. దాంతో ఆ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ బ్రహ్మాజీ వేసిన సెటైర్ ఏంటో తెలుసా …… అంకుల్ ఏంట్రా అంకుల్ …… నన్ను బాడీ షేమింగ్ చేస్తావా ? కేసు వేస్తా అని ట్వీట్ చేయడమే. సోషల్ మీడియాలో తరచుగా ఏదో ఒక ట్వీట్ లు పెట్టే బ్రహ్మాజీ తాజాగా తన ఫోటో ఒకటి పెట్టాడు.
ఇంకేముంది ఆ ఫోటోను చూసి కొంతమంది బాగుందని అంటుంటే మరికొందరు బాగోలేదు అంకుల్ అని కామెంట్ చేసారు. అంతే బ్రహ్మాజీకి కోపం వచ్చింది. అంకుల్ ఏంట్రా అంకుల్ …… కేసు వేస్తా ? అని రీ ట్వీట్ చేసాడు. దాంతో అంకుల్ ఆంటీ కి మళ్ళీ కోపం వస్తుంది. ఈసారి సీఎం కు పీఎం కు కూడా కంప్లైంట్ చేస్తుంది అంటూ అనసూయ ని ఇందులోకి లాగారు నెటిజన్లు.
ఇటీవల అనసూయ తనని ఆంటీ అని సంబోధించిన అందరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని అవమానించిన వాళ్ళందరి స్క్రీన్ షాట్ లను సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చింది. అయితే అనసూయ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు. ఇక అసలే తనని ఆంటీ అని పిలిచి అవమానిస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోతున్న అనసూయకు బ్రహ్మాజీ ట్వీట్ తప్పకుండా మరింతగా మండేలా చేయడం ఖాయమని అంటున్నారు.
Breaking News