సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. అంతేకాదు ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో పెట్టేసి సంచలనం సృష్టించాడు. గతకొంత కాలంగా నరేష్ – పవిత్ర ల వ్యవహారం సోషల్ మీడియాలో అలాగే సినిమా రంగంలో వివాదం సృష్టిస్తూనే ఉంది. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. మేము సహజీవనం చేస్తున్నాం ……. ఇందులో దాచాల్సింది ఏమి లేదు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసాడు. అలాగే మీడియాకు కూడా పంపించాడు తన పెళ్లి గురించి. ఈ పెళ్లి వీడియోలో కొంతమంది యువతీయువకులు మాత్రమే ఉన్నారు. నరేష్ – పవిత్ర ఇద్దరూ కలిసి ఏడడుగులు వేస్తున్న వీడీయో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ఉంది.
గతంలోనే ఈ ఇద్దరూ లిప్ లాక్ చేస్తూ ఓ వీడేమో విడుదల చేసారు. ఆ వీడియోలో మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ లిప్ లాక్ వీడియో రిలీజ్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముసలోళ్లకు దసరా పండగా అంటూ ఘాటు విమర్శలే చేశారు నెటిజన్లు. అయితే నెటిజన్లు అలాగే సినిమావాళ్లు ఎన్ని విమర్శలు చేసినా నరేష్ – పవిత్ర మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.