టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి నుండి ఇంకా కోలుకోకముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు (78 ) గుండెపోటుతో మరణించారు. ఈరోజు తెల్లవారు జామున ( డిసెంబర్ 25 న ) గుండెపోటుతో మరణించారు చలపతిరావు. దాంతో టాలీవుడ్ మరోసారి శోక సంద్రంలో మునిగింది. 1944 మే 8 న లో కృష్ణా జిల్లా బల్లి పర్రు చలపతిరావు స్వగ్రామం. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన గూఢచారి 116 చిత్రంతో నటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు.
మొత్తంగా 1200 కు పైగా సినిమాల్లో నటించారు చలపతిరావు. విలన్ గా ఎక్కువ పాత్రల్లో నటించారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , హాస్య నటుడిగా కూడా నటించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు అనుంగు శిష్యుడిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ , శోభన్ బాబు , కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, డాక్టర్ రాజశేఖర్, మోహన్ బాబు తదితర హీరోల చిత్రాల్లో నటించారు. చలపతిరావు కు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. నటుడు, దర్శకుడు రవిబాబు చలపతిరావు కొడుకు అనే విషయం తెలిసిందే. చలపతిరావు మృతితో షాక్ కు లోనైన టాలీవుడ్ చలపతిరావు మృతికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.