టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు , రచయిత , దర్శకుడు వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు. టాలీవుడ్ లో ఇటీవల పలువురు సినీ ప్రముఖులు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. కైకాల సత్యనారాయణ, చలపతిరావు ల మరణం నుండి పరిశ్రమ కోలుకోకముందే వల్లభనేని జనార్దన్ మృతి తో మరోసారి విషాదం నెలకొంది. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించాడు వల్లభనేని జనార్దన్. అలాగే జనార్దన్ రచయిత కూడా కావడం విశేషం. రచయిత , నటుడు మాత్రమే కాకుండా దర్శకుడు గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో కొంత కాలంగా సినిమాల్లో నటించడం లేదు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. వల్లభనేని జనార్దన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Breaking News