బ్రేకింగ్ న్యూస్…… అనుకున్నట్లుగానే ఆర్ ఆర్ ఆర్ అరుదైన ఫీట్ సాధించింది. ఆస్కార్ రేసులో ఆర్ ఆర్ ఆర్ చిత్రం పోటీ పడుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిస్ట్ లో నాటు నాటు అనే పాట నామినేట్ అయినట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా కీరవాణి సంగీతం అందించాడు. చంద్రబోస్ రచన అందించిన పాట నాటు నాటు. ఈ పాట థియేటర్ లలో దుమ్ము రేపిన విషయం తెలిసిందే.
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ ను సైతం సొంతం చేసుకుంది నాటు నాటు అనే పాట. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మేనియా స్టార్ట్ అయ్యింది. నాటు నాటు అనే పాటను చంద్రబోస్ రాయగా రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ ఆలపించారు. ఇక కీరవాణి సంగీతం అందించాడు. ఇదే పాట ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు చిత్రానికి దక్కిన గౌరవం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆస్కార్ బరిలో నామినేషన్ మాత్రమే అయ్యింది. ఇక అసలు సమరం ముందుంది.
WE CREATED HISTORY!! 🇮🇳
Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe
— RRR Movie (@RRRMovie) January 24, 2023