Allu arjun బన్నీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, స్టార్ నిర్మాత అల్లు అరవింత్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చాడు. తన నటన, డ్యాన్స్ తో యూత్ కు ఐకాన్ అయ్యాడు. ఇండియా వ్యాప్తంగా బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు. డ్యాన్స్ ఇరగదీసే ఈ స్టార్ కి మంచి మార్కులే పడుతున్నాయి. ప్రస్తుతం పుష్ప సినిమాలో తన నటన ద్వారా విమర్శకుల అభిమానాన్ని కూడా బన్నీ చూరగొన్నాడు.
టాలీవుడ్ లో పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఇతర భాషల్లో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో తగ్గేదేలే డైలాగ్ లా ఆయనకు అభిమానుల సంఖ్య కూడా పెరుగుతున్నది. పాత్ర ఏదైనా నటించడం కాదు.. జీవించడం మాత్రమే ఈ స్టైలిష్ స్టార్ కు తెలుసు. 2021లో అత్యధికంగా ఎక్కువ సెర్చ్ చేసిన హీరోల పేర్లలో బన్నీ అగ్రస్థానంలో ఉన్నారని తెలుస్తున్నది. అయితే ఇదే సమయంలో అల్లు అర్జున్ గురించి మరొకరు ఒక కొత్త అంశం వెల్లడించారు.
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. సీనియర్ స్టార్ అదిత్య ఓం చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఇండియాలోనే నంబర్ వన్ స్టార్ బన్నీ అంటూ కొనియాడారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రభాస్, యశ్ చోప్రా ఉంటారని తెలిపారు. ఇప్పుడు అదిత్య ఓం మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది బన్నీ ఫ్యాన్స్ కు చెప్పలేనంత ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ఇక తగ్గేదేలే అంటూ వారు ట్రోల్ చేస్తున్నారు.