నందమూరి కుటుంబాన్ని కార్ యాక్సిడెంట్ అనే సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంది. చాలా సంవత్సరాలుగా నందమూరి కుటుంబం యాక్సిడెంట్ లలో చాలామంది ప్రాణాలను కోల్పోయింది. అయితే అదే సమయంలో కార్ యాక్సిడెంట్ లో గాయాలతో బయటపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. నందమూరి తారకరామారావు తండ్రి యాక్సిడెంట్ లోనే చనిపోయాడు.
అలాగే నందమూరి హరికృష్ణ , నందమూరి జానకిరామ్ కూడా ఇలా యాక్సిడెంట్ ల రూపంలోనే చనిపోయారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కరెండుసార్లు కార్ యాక్సిడెంట్ నుండి గాయాలతో బయటపడ్డాడు. ఆ సంఘటనలను పక్కన పెడితే తాజాగా నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ కు గురయ్యారు. హైదరాబాద్ లో ఈ కార్ యాక్సిడెంట్ జరిగింది.
ఈ సంఘటనలో నందమూరి రామకృష్ణకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలుస్తోంది. అయితే కారు మాత్రం నుజ్జు నుజ్జు అయింది. నందమూరి రామకృష్ణ బాలయ్యకు తమ్ముడు అవుతాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు రామకృష్ణ. అలాగే బాలయ్య వ్యవహారాలు కూడా చూసేవాడు అప్పట్లో. పక్షవాతంతో ఒక చేయి సరిగ్గా పని చేయకపోవడంతో అప్పటి నుండి బాలయ్య వ్యవహారాలను చూడటం మానేసాడు. నందమూరి రామకృష్ణకు యాక్సిడెంట్ అయ్యింది అనే విషయం నందమూరి కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.