
బ్రేకింగ్ న్యూస్…… అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , హీరో రానా లపై కేసు నమోదు అయ్యింది. ఫిలిం నగర్ లోని భూవివాదంలో ఈ కేసు నమోదు అయ్యింది. సంఘటన వివరాలలోకి వెళితే……. ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి సురేష్ బాబు , రానా ల స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. అయితే ప్రమోద్ కుమార్ ఆ స్థలాన్ని మరొక వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. దాంతో సురేష్ బాబు , ప్రమోద్ కుమార్ మధ్య వివాదం తలెత్తింది. ఇక అప్పటి నుండి ఇది సాగుతూనే ఉంది. ఈ విషయంపై మాట్లాడటానికి వెళ్లిన ప్రమోద్ ను సురేష్ బాబు , రానా దూషించారట.
దాంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి లాభం లేదని భావించిన ప్రమోద్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు సురేష్ బాబు, రానా లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకేముంది కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.