
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. హరి- హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. సమంత కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిన ఈ తరుణంలో ఓ కేసు సమంత యశోద చిత్రాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ ఆ ఇబ్బంది ఏంటో తెలుసా …….
సమంత నటించిన యశోద చిత్రం ” ఇవా ” అనే పేరుతో ఓ ఐవీఎఫ్ హాస్పిటల్ లో జరిగే అక్రమాల నేపథ్యంలోనే రూపొందింది. కట్ చేస్తే హైదరాబాద్ లో ఇదే పేరుతో ఐవీఎఫ్ హాస్పిటల్ ఉండటం గమనార్హం. దాంతో మా రెప్యుటేషన్ దెబ్బతిందని , ఇలా నేరుగా మా పేరు పెట్టడం వల్ల చాలామంది ఫోన్లు చేసి మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని ఆగ్రహించిన ఆ హాస్పిటల్ కోర్టును ఆశ్రయించింది.