
అల్లు అర్జున్ భామ కేథరిన్ ట్రెసా . కెరీర్ ప్రారంభంలో ఈ భామ అల్లు అర్జున్ తో కలిసి నటించింది. రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి ప్రియురాలిగా అలాగే సరైనోడు చిత్రంలో ఒక హీరోయిన్ గా , ఇద్దరమ్మాయిలతో చిత్రంలో కూడా మరొక హీరోయిన్ గా నటించింది. సరైనోడు పెద్ద హిట్ కాగా రుద్రమదేవి మంచి హిట్ అయ్యింది. అయితే ఇద్దరమ్మాయిలతో చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
కేథరిన్ ట్రెసా అందాలను ఆరబోయడంలో ఎక్కడా తగ్గేదేలే అంటోంది. అయితే ఎంతగా అందాలను ఆరబోసినా ఈ భామకు ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ అందలేదు. దాంతో ఐటెం సాంగ్స్ కూడా చేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 చిత్రంలో ఈ భామ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఈ భామ పుష్ప 2 లో నటించబోయే పాత్ర ఏంటో తెలుసా ……. విలన్ క్యారెక్టర్ అంట. అవును నెగెటివ్ రోల్ పోషించడానికి సిద్ధం అవుతోందట కేథరిన్. ఈ భామ అల్లు అర్జున్ కు లక్కీ భామ అనే చెప్పాలి. మూడు చిత్రాల్లో నటిస్తే …… అందులో రెండు మంచి హిట్ అయ్యాయి. దాంతో కేథరిన్ అంటే అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే పుష్ప 2 లో అవకాశం లభిస్తోంది అని తెలుస్తోంది.