సూపర్ స్టార్ కృష్ణ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నానక్ రామ్ గూడ లోని కృష్ణ నివాసానికి చేరుకున్న నారా చంద్రబాబు తొలుత మహేష్ బాబు ను కలిసి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం కృష్ణ కు నివాళి అర్పించారు. తనకు కృష్ణతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు చంద్రబాబు.
ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత నానక్ రామ్ గూడ లోని కృష్ణ ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. కృష్ణకు నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రేపు కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చాలాసార్లు చూశానని కృష్ణ కు చెప్పానని , అయితే మీరు సినిమాలు కూడా చూస్తారా ? అంటూ నవ్వారని చెప్పారు కేసీఆర్.