యు బ్లడ్ ఓ సంజీవని లాంటిదని వ్యాఖ్యానించారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్. పలు సమయాల్లో రక్తం అవసరం పడుతోందని, ఆపరేషన్ లు , రోడ్డు యాక్సిడెంట్ సమయాల్లో అవసరమైన గ్రూప్ రక్తం దొరక్క సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వాళ్లకు యు బ్లడ్ సర్వరోగ నివారిణిలా …… సంజీవనిలా మారిందని , ఇలాంటి అద్భుతమైన యాప్ ని క్రియేట్ చేసిన జై యలమంచిలిని తప్పకుండా అభినందించాల్సిందే అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. యు బ్లడ్ యాప్ ని అందరు కూడా తప్పకుండా డౌన్ లోడ్ చేసుకోవాలని , తద్వారా రక్తదాతలతో పాటుగా రక్త గ్రహీతలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని JSW & Jaiswaraajya కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంస్థ కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీపావళి సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.