
ఛార్మి ఐ లవ్ యు అంటూ వేదిక మీదే చెప్పి సంచలనం సృష్టించాడు దర్శకులు పూరీ జగన్నాథ్ . ఈ సంచలన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” లైగర్ ”. ఈ చిత్రం ఆగస్టు 25 న విడుదల అవుతున్న సందర్బంగా వరంగల్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు.
అయితే నిన్న వరంగల్ లో జోరుగా వర్షం పడటంతో భారీ బహిరంగ సభని రద్దు చేసుకొని ఓ ఫంక్షన్ హాల్లో లైగర్ ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు. కాగా ఆ వేడుకలో ఈ సినిమా కోసం నేను , ఛార్మి ఎంతగా కష్టపడ్డాం అనే విషయాలను చెప్పుకుంటూ ఛార్మి చేస్తున్న పనులకు ఐ లవ్ యు అంటూ అందరి ముందే చెప్పి షాక్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్.
గతకొంత కాలంగా ఛార్మితోనే పూరీ జగన్నాథ్ ఎక్కువగా ఉంటున్నాడని , భార్యను , కూతురు , కొడుకును అంతగా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చేలా బండ్ల గణేష్ చేసిన వాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. కట్ చేస్తే పూరీ అందరి ముందు ఛార్మికి ఐ లవ్ యు చెప్పడంతో ఇక సోషల్ మీడియాలో మరింత రచ్చ రచ్చ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక లైగర్ విషయానికి వస్తే …… ఇది పాన్ ఇండియా చిత్రం. ఆగస్టు 25 న భారీ ఎత్తున విడుదల కానుంది.