ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం ఫిబ్రవరి 4 న మరణించిన సంగతి తెలిసిందే. ముఖం పై అలాగే నుదురు పై తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణం కాదని భావించిన చెన్నై పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేశారు. వాణీ జయరాం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ సిబ్బంది ఎట్టకేలకు తమ నివేదిక పోలీసులకు ఇచ్చారు.
ఇంతకీ వాణీ జయరాం మృతికి కారణం ఏంటో తెలుసా…… బెడ్ మీద నుండి కిందకు దిగుతున్న సమయంలో అదుపుతప్పి కింద పడటమేనట. ఒక్కసారిగా కింద పడటంతో తలకు అలాగే నుదురుకు బలమైన గాయాలు అయ్యాయి. ఆ గాయాల తోనే వాణీ జయరాం మరణించినట్లు ధ్రువీకరించారు పోలీసులు. వాణీ జయరాం ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ ని పూర్తిగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు పోలీసులు. భారతీయ భాషాలన్నింటిలో కూడా పాటలు పాడారు వాణీ జయరాం. మొత్తానికి 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం కు తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.