గాయని వాణీ జయరాం ఈరోజు మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు , తమిళ , మలయాళ , కనడ , హిందీ భాషల్లో 20 వేల పాటలు పాడిన మహాగాయని. చెన్నై లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణం సహజ మరణమా ? లేక హత్య చేసారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎందుకంటే ముఖం పై అలాగే నుదురు పై బలమైన గాయాలున్నాయి. దాంతో వాణీ జయరాం ను ఎవరైనా హత్య చేసారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారు. పని మనిషి వచ్చి ఎంతగా తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఆ తలుపులను బద్దలుకొట్టి తీసినట్లుగా పని మనిషి చెప్పడంతో పని మనిషిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.