
వివాదాస్పద నటుడు , నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో పొద్దుటూరు కోర్టుకు హాజరయ్యాడు. అయితే చెక్ బౌన్స్ కేసులో విచారణను ఈనెల 22 కు వాయిదా వేసింది కోర్టు. దాంతో తిరుగు ప్రయాణమయ్యాడు బండ్ల. పొద్దుటూరులో పలు చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. దాంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు బండ్ల గణేష్.
ఒకప్పుడు నటుడిగా పలు చిత్రాల్లో నటించిన బండ్ల గణేష్ ను నిర్మాతగా నిలబెట్టింది పవన్ కళ్యాణ్, రవితేజ లు. పవన్ కళ్యాణ్ వరుసగా రెండు సినిమాలు చేయడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. మళ్లీ అవకాశం ఇస్తాడేమో అని ఆశగా ఎదురు చూసి …… చూసి విసిగిపోయాడు. దాంతో ఇటీవల కాలంలో పలు ట్వీట్ లు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక రవితేజ మళ్లీ ఫామ్ లోకి రావడంతో అతడు డేట్స్ ఇస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు బండ్ల గణేష్