36.5 C
India
Friday, April 10, 2026
More

    బలగం మొగిలయ్యకు చిరంజీవే బలం..!

    Date:

    Chiranjee is the strength of Mogilaya
    Chiranjee is the strength of Mogilaya

    సేవా కార్యక్రమాలు చేయడానికి, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. టాలీవుడ్‌ ఇండస్ర్టీలో, అభిమానులు కుటుంబాలకు ఎవరికి ఏ ఆపద వచ్చిన సహకరించడానికి ఆయన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది.అలాంటి మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న మొగిలయ్య చికిత్సకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించాడు. బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య గత 30 సంవత్సరాలుగా డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయనకు రెండు కిడ్నీలు పాడవడంతో ఏడాది కాలం నుంచి రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా గుండెపోటు రావడంతో మొగిలయ్య ఫ్యామిలీ ఆందోళన చెందారు.

    మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటంతో ముందుగా వరంగల్ లో, తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి నిమ్స్ లో రక్త పరీక్షలు చేయించి కొంత కుదుట పడేలా చేశారు. అయితే కంటి చూపు మందగించింది. పైగా మొగిలయ్య ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. సామాజిక వర్గం పరంగా కూడా అండగా నిలిచే పరిస్థితి లేదు. బలగం మూవీ నటులు చేదోడు వాదోడుగా ఉన్నారు. మొగిలయ్య దీన పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆయన కంటిచూపు చికిత్సకు ఆర్థిక సాయం చేస్తానని … ఎంత ఖర్చయినా సరే తనే భరిస్తానని చిరు తెలిపారట. బలగం దర్శకుడు వేణుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. అతనికి అండగా ఉంటానని.. కంటి చూపు చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.

    ఇక చిరంజీవి సంపాదించిన డబ్బులో సింహభాగం అవసరంలో ఉన్నవారికి ఖర్చు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటితో అనేక సేవలు చేస్తున్న ఆయన కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు పెద్దన్నగా నిలుస్తున్నాడు. ఏ ఇబ్బందులు ఉన్న అన్నయ్యగా భరోసా ఇస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మందికి ఆర్థికసాయం చేసిన చిరంజీవి ఇప్పుడు మొగిలయ్య కోసం సాయం చేయడానికి ముందుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ విషయం మొగిలయ్య కుటుంబసభ్యులు ఓ ఇంటర్వ్యూలో చెప్పగా చిరు చేస్తున్న సాయం బయటకు వచ్చింది. ఇంత సాయం చేసి కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అంతేకాక దటీజ్ మెగాస్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...