మెగాస్టార్ చిరంజీవి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇద్దరు కూడా బావ – బావమరుదులు అనే విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కోసం అల్లు అరవింద్ చాలా కష్టపడ్డాడు. అయితే ఇటీవల కాలంలో చిరంజీవి – అల్లు అరవింద్ కుటుంబాలు పెద్దగా కలవడం లేదు. దాంతో చిరంజీవి – అల్లు అరవింద్ కుటుంబాల మధ్య వైరం కొనసాగుతోందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా అల్లు అరవింద్ ని ఇదే విషయం పై ప్రశ్నించగా దానికి సరైన సమాధానమే చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అలాగే అందరు కూడా సినిమారంగంలో ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్ లతో , అలాగే కథా చర్చలలో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. పండగలు లేదా ఏదైనా ఫంక్షన్ లలో మేము , చిరంజీవి గారి కుటుంబం కలుస్తూనే ఉంది. అయితే ఇంతకుముందు కంటే తక్కువగా కనిపిస్తోందని కావచ్చు ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు రాసేసుకుంటున్నారు దానికి మేము ఎలా జవాబుదారులం అంటూ ఎదురు ప్రశ్నించారు.
మెగా కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్నారు అలాగే అల్లు కుటుంబంలో కూడా అల్లు అర్జున్ తో పాటుగా అల్లు శిరీష్ కూడా హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కు ఊహించని స్టార్ డం లభించడంతో తనపై మెగా హీరో ముద్ర పడకుండా జాగ్రత్త పడుతున్నాడని రకరకాల ఊహాగానాలు వైరల్ గా మారుతున్నాయి.
Breaking News