
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మరో షాక్ ఇవ్వనుందా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. దానికి తోడు శ్రీజ తాజాగా చేసిన పోస్ట్ కూడా మరింత షాక్ అయ్యేలా చేస్తోంది. ఇంతకీ శ్రీజ చేసిన పోస్ట్ ఏంటో తెలుసా …….. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ పోస్ట్ చేయడమే !
” 2022 సంవత్సరం నాకు అత్యంత ముఖ్యమైన ఏడాది అనే చెప్పాలి. ఎందుకంటే అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేసావ్ ……. నా గురించి బాగా తెలిసిన వ్యక్తిని , నన్ను బాగా ప్రేమించే వ్యక్తిని , కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తిని , నాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉండేవాడిని పరిచయం చేసావ్. తనని కలవడం నా అదృష్టం ……. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను ” అంటూ పోస్ట్ చేసి బాంబ్ పేల్చింది.
శ్రీజ చేసిన పోస్ట్ ప్రకారం మరో వివాహానికి సిద్దమైందా ? అనే అనుమానం తలెత్తుతోంది. ఇప్పటికే శ్రీజ కు రెండు వివాహాలు అయ్యాయి. మొదటి భర్తకు ఒక కూతురు కాగా రెండో భర్తకు కూడా ఒక కూతురు. ప్రస్తుతం ఆ ఇద్దరు కూతుర్లు శ్రీజ వద్దే ఉన్నారు. ఇక గత ఏడాది కాలానికి పైగా కళ్యాణ్ దేవ్ – శ్రీజ ల మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయని , దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా కళ్యాణ్ దేవ్ – శ్రీజ లు వేరు వేరుగా ఉంటున్న సంగతి తేటతెల్లమైంది. ఇక ఇప్పుడు శ్రీజ చేసిన పోస్ట్ ఫిలిం నగర్ వర్గాలను మాత్రమే కాదు మెగా అభిమానులను కూడా కలవపడేలా చేస్తోంది.