
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. గతకొంత కాలంగా సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటోంది శ్రీజ. పలు అంశాల వల్ల కూడా శ్రీజ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసింది ఈ భామ. దుఃఖంలో ఉన్నప్పుడు అలాగే సంతోషంలో ఉన్నప్పుడు కోప్పడినప్పుడు ఇలా అన్ని సందర్భాల్లో తనకు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని , వాళ్లే తన బలం అని అంటోంది శ్రీజ.
గతంలో శ్రీజ భరద్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు అతడితో విబేధాలు తలెత్తడంతో అతడికి విడాకులు ఇచ్చింది. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న తర్వాత కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తో కూడా ఉండటం లేదు. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో అతడికి కూడా విడాకులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే కళ్యాణ్ దేవ్ తో విడాకులు అయిన విషయాన్ని అధికారికంగా మాత్రం వెల్లడించలేదు కానీ ఫిలిం నగర్ సర్కిల్లో వినబడుతున్న కథనం మాత్రం ఇదే. శ్రీజ కు ఇద్దరు కూతుర్లు ….. కాగా ఒక కూతురు టీనేజ్ లో ఉండటం గమనార్హం. అసలు ఆ అమ్మాయిని శ్రీజ ను చూస్తే అక్కచెల్లెలు అని అంటారేమో అలా ఉంటారు మరి.