ఓటమి ఎరుగని డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో దర్శకుడు కొరటాల శివకు సడెన్ బ్రేక్ వేసిన మూవీ ఆచార్య.. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్లతో హై రేంజ్ లో ఉన్న ఆయన కెరీర్ ను ఒక్కసారిగా పాతాళానికి తీసుకొచ్చింది ఆచార్య మూవీ. అటు మెగాస్టార్ చిరంజీవికి కూడా కమ్ బ్యాక్ లో భారీ డిజాస్టర్ గా మారి.. ఆయన స్పీడ్ కు బ్రేక్ వేసింది. పరస్పరం చేదు అనుభవాలు ఎదురుకావడంతో మెగాస్టార్, కొరటాల మధ్య మనస్పర్థలు సైతం వచ్చాయన్న మాటలు ఇండస్ట్రీలో వినిపించాయి. అయితే వారిద్దరూ కలిసి త్వరలో స్టేజ్ షేర్ చేసుకోబోతున్నరాన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఆచార్య అపజయం నుంచి కోలుకున్న కొరటాల..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అనుకున్న సినిమాను ఇక లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఇద్దరూ అనుకుంటున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న ఈ మూవీ ఫిబ్రవరి రెండవ వారం నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవం గురించి ఒక మాసివ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ తన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పనిచేసిన ముఖ్యమైన టెక్నిషియన్స్ అందరినీ ఈ మూవీ లాంచింగ్ కోసం పిలుస్తున్నాడు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ మొత్తం రానున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి ఫ్యామిలీ తో పాటు రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందిందట. దానికి చిరంజీవి కూడా పాజిటివ్ గానే స్పందించాడట. చూడాలి మరి మెగాస్టార్ మాట వరుసకే వస్తానన్నాడా.. లేక నిజంగా వస్తాడా అన్నది.