నాకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక లేదని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు చిరంజీవి. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రాజమౌళి మంచి దర్శకుడు. తెలుగు సినిమాను , భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. నాకు రాజమౌళి అంటే గౌరవం. అయితే ఆయన ఓ సినిమాకు 3 నుండి ఐదేళ్ల సమయం తీసుకుంటాడు. అదే నేను ఇప్పుడు ఒకే సమయంలో నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఈ వయసులో పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకోవాలనే తపన లేదు. అంతేకాకుండా రాజమౌళి ఆలోచనలకు తగ్గట్లుగా నేను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయలేనేమో అంటూ రాజమౌళి పై తనకున్న అభిప్రాయాలను వెల్లడించాడు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార , సునీల్, సత్యదేవ్, సముద్ర ఖని తదితరులు నటించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 5 న దసరా కానుకగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు.