
బాలయ్య వీర సింహా రెడ్డి కూడా సంక్రాంతి బరిలో దిగుతోంది ఆ సినిమా కూడా హిట్ కావాలి అలాగే మా వాల్తేరు వీరయ్య కూడా హిట్ అవుతుందని వ్యాఖ్యానించాడు మెగాస్టార్ చిరంజీవి. నిన్న రాత్రి వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.
కాగా ఆ ఈవెంట్ లో పై వ్యాఖ్యలు చేసి బాలయ్యకు మద్దతు పలికాడు చిరు. అయితే వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం బాలయ్య చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో బాలయ్య కూడా ఓ మాట చిరంజీవి సినిమా గురించి మాట్లాడి ఉంటె బాగుండేదని అంటున్నారు అంతా.






