
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. తెలుగు జాతి గర్వించదగ్గ నటులని , ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో ఆ పాత్రకు ప్రాణం పోసిన మహా నటుడు కైకాల సత్యనారాయణ. ఆయనతో ఎక్కువ సినిమాలు చేసే అదృష్టం లభించిందన్నారు.
చిరంజీవి, బాలకృష్ణ లకు కైకాల సత్యనారాయణ తండ్రిగా నటించాడు. అలాగే విలన్ గా కూడా తలపడ్డాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా విభిన్న పాత్రలను పోషించాడు. ఆయనతో నటించే సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకునే వాళ్ళమని అతడితో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇక కైకాల సత్యనారాయణ తన సోదరుడు కైకాల నాగేశ్వరరావు తో కలిసి కొన్ని చిత్రాలను కూడా నిర్మించాడు. చిరంజీవితో కొదమ సింహం , బాలయ్య తో ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించాడు. ముద్దుల మొగుడు యావరేజ్ కాగా కొదమ సింహం సూపర్ హిట్ అయ్యింది. కైకాల సత్యనారాయణతో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్క నటీనటులు, సాంకేతిక నిపుణులు కైకాల మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.