స్టార్ హీరోయిన్ అనుష్క తో మనం సినిమా చేద్దాం ……. ఆమె డేట్స్ ఇప్పిస్తానని ఎల్లారెడ్డి అనే మేనేజర్ 51 లక్షలు తీసుకుని మోసం చేసాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు నిర్మాత లక్ష్మణ్ చారి. విశ్వకర్మ క్రియేషన్స్ అనే బ్యానర్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడట. ఎల్లారెడ్డి అనే మేనేజర్ అనుష్కతో సినిమా చేద్దామని చెప్పి బెంగుళూరు కు తీసుకెళ్లి అక్కడ కొంతమందిని పరిచయం చేసి నమ్మించాడట.
అలాగే సంగీత దర్శకుడు మణిశర్మ ను పెట్టుకుందామని అతడి పేరు కూడా చెప్పి మొత్తంగా 51 లక్షలు తీసుకున్నాడట. ఇక ఈ సంఘటన జరిగి ఏడాది దాటింది. అప్పటి నుండి అనుష్క డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడట. అయితే మోసం ఎన్నాళ్ళు దాగుతుంది …… మోసపోయానని తెలుసుకొని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసాడట. దాంతో డబ్బులు ఇస్తాను ….. పొరపాటు జరిగింది అని చెప్పి ఏడాది నుండి ఆ డబ్బులు ఇవ్వడం లేదట ! దాంతో పోలీసులను ఆశ్రయించాడు లక్ష్మణ్ చారి.