
నందమూరి తారకరామారావు కు దర్శకులు కె. విశ్వనాథ్ కు ఓ సినిమా విషయంలో గొడవలు జరిగాయి. దాంతో ఆ ఇద్దరూ 14 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు. ఎన్టీఆర్ – విశ్వనాథ్ ల మధ్య సయోధ్య కుదర్చడానికి కొంతమంది సన్నిహితులు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. అయితే 14 సంవత్సరాల తర్వాత మాత్రం నందమూరి బాలకృష్ణ కోసం ఈ ఇద్దరూ కలిశారు.
ఇంతకీ ఎన్టీఆర్ కు విశ్వనాథ్ కు విబేధాలు వచ్చాయంటే …… చిన్ననాటి స్నేహితులు అనే సినిమా విషయంలో. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చిన్ననాటి స్నేహితులు సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ….. అది కూడా సెంటిమెంట్ సీన్ లో ఎన్టీఆర్ కూలింగ్ గ్లాస్ పెట్టుకొని నటించాడట. ఇక్కడే విశ్వనాథ్ కు కోపం వచ్చింది. ఇది సెంటిమెంట్ సీన్ దాంట్లో నటించాలి అంటే కళ్ళద్దాలు తీసేసి నటించాలి కానీ కూలింగ్ గ్లాస్ పెట్టడం వల్ల హావభావాలు ఎలా తెలుస్తాయి అని వాదించాడట. అయితే విశ్వనాథ్ ఎంత చెప్పినా ఎన్టీఆర్ మాత్రం ఆ కూలింగ్ గ్లాస్ తీసేది లేదు అని ఆ సీన్ కంప్లీట్ చేసి వెళ్లిపోయాడట. దాంతో విశ్వనాథ్ కు చాలా కోపం వచ్చిందట. ఇంకేముంది 14 సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య మాటల్లేవ్.
అయితే 14 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ విశ్వనాథ్ ను పిలిపించి గౌరవించి బాలయ్య హీరోగా ఒక సినిమా చేయండని చెప్పాడట. అదే జననీ జన్మభూమి. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. మళ్లీ బాలయ్య – విశ్వనాథ్ కలిసి సినిమా చేయలేదు. కానీ నటుడిగా మాత్రం బాలయ్యతో కలిసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు విశ్వనాథ్. నరసింహనాయుడు , లక్ష్మీ నరసింహా , సీమ సింహం తదితర చిత్రాల్లో బాలయ్య – విశ్వనాథ్ తండ్రీ కొడుకులు గా నటించారు.