Singer Chinmai Fire సింగర్ శ్రీపాద చిన్మయి.. ఈమె అందరికి సుపరిచితమే.. సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. ఎన్నో చిత్రాలకు పని చేసిన ఈమె మీటూ ఉద్యమంలో భాగంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈమె మొదటి నుండి మహిళల విషయంలో న్యాయం అడగడానికి ముందు ఉంటుంది.. మీటూ ఉద్యమంలో భాగంగా ఈమె అప్పట్లో తమిళ్ పాటల రచయిత వైరముత్తు మీద అనేక ఆరోపణలు చేసింది.
ఈమె చేసిన ఆరోపణలు అప్పట్లో వైరల్ అయ్యాయి.. అక్కడ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీయగా ఈమెను అక్కడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. ఈ విషయంపై ఈమె తాజాగా ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈమె చేసిన పోస్ట్ మరోసారి చర్చకు దారి తీసింది.
వైరముత్తు పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయం మీద ఈమె మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారు? 2018 నుండి నన్ను తమిళ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేసారు.
నేను గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు అందుకున్న.. నన్ను అయినా బ్యాన్ చేసారు.. ఐదేళ్లుగా నరకం చూస్తున్నా.. న్యాయస్థానంలో న్యాయం అడిగినందుకు నా మీద కక్ష కట్టారు.. ఎంతో మందిని వేధించేవాడు కవి.. రాజకీయ నాయకులతో, డీఎంకేతో అతడి బంధం కలిసొచ్చింది.. వీరిని అడ్డుపెట్టుకుని ఏ ఆడదాని మీద అయిన చెయ్యి వేయగలుగుతాను అనుకుంటున్నాడు. రాజకీయ నాయకులూ మహిళల భద్రతల గురించి మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది అంటూ ఈమె చేసిన కామెంట్స్ రాజకీయంగా ప్రకంపనలు రేపాయి..