కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” బలగం ”. అగ్ర నిర్మాత దిల్ రాజు వారసులు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 3 న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో బలగం చిత్ర కథ నాదే అంటూ వచ్చాడు ఓ రచయిత.
నమస్తే తెలంగాణలో నేను రాసిన కథ ఇదే నని , కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని చేసాడని వేణు పై ఆరోపణలు చేస్తున్నాడు సదరు రచయిత. బలగం తెలంగాణ నేపథ్య కథా చిత్రమని తెలిసి వెళ్లి చూసాను. అయితే నా కథను కాపీ కొట్టి తీసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ప్రస్తుతం బలగం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటోంది. దాంతో ఈ వివాదాన్ని పట్టించుకోవడం లేదు. కాకపోతే తర్వాత ఎలాగూ స్పందించాల్సి వస్తుంది. అప్పుడు వేణు ఏమంటాడో చూడాలి. నమస్తే తెలంగాణ ఆదివారం మ్యాగజైన్ లో నాకథ అచ్చు అయ్యింది కాబట్టి ఈ కథ నాదేనని అంటున్నానని ,అందుకు సాక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నాడు ఆ రచయిత. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.