సీపీఐ జాతీయ నాయకులు నారాయణ బిగ్ బాస్ షో పై నిప్పులు చెరిగారు. బిగ్ బాస్ షో ఓ వ్యభిచారకూపంలా తయారయ్యిందని , ఇలాంటి షోకు నాగార్జున లాంటి వ్యక్తి చేయడం సిగ్గుపడాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటీవల JSW & JaiSwaraajya యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు నారాయణ.
ఆ సందర్బంగా కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ తో సాగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు నారాయణ. కమ్యూనిస్ట్ పార్టీలకు రోజు రోజుకు గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నప్పటికీ ప్రజల కోసం పోరాటం చేయడంలో ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటామని , ప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీల పోరాటం ద్వారానే సాధ్యమౌతుందని ఘంటాపథంగా చెప్పారు. మా పోరాటాల ద్వారానే ఎన్నో సమస్యలు వెలుగులోకి వచ్చాయని , వాటికి పరిష్కారం కూడా చూపించామన్నారు. ప్రజల తరుపున అద్భుత పోరాట పటిమ ప్రదర్శిస్తున్న సీపీఐ నాయకులు నారాయణకు కృతఙ్ఞతలు తెలిపారు JSW & JaiSwaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్.