
మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటాడు. దేవీ శ్రీ ప్రసాద్ నాలుగు పదుల వయసులోకి వచ్చిన పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీంతో డీఎస్పీ పెళ్లి మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. ఎంతో మంది హీరోయిన్లతోనూ దేవీ శ్రీ ప్రసాద్ రిలేషన్ మెయింటైన్ చేశారనే గాసిప్స్ కూడా వచ్చాయి. కానీ అవేవీ బయటకు రాలేదు. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
త్వరలోనే దేవి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న దేవి తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతోన్నాడట. వరుసకు మరదలయ్యే అమ్మాయితో పెద్దలు ఈ పెళ్లి చేస్తున్నారట. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కుటుంబసభ్యుల నిర్ణయం ప్రకారం వీరి వివాహం జరుగుతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది.
రీసెంట్ గా వాల్తేరు వీరయ్య మ్యూజికల్ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న దేవీశ్రీ. ప్రజెంట్ పుష్ప 2 కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ మధ్య దేవిశ్రీ ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తన సినిమాల రికార్డింగ్స్ కూడా అక్కడి నుంచి చేస్తున్నాడు. దీంతో బంధువులు పెళ్లిని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా తన పెళ్లి బంధువుల సమక్షంలో చెన్నైలో ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ గా చేసుకోవడానికి చూస్తున్నాడట. ఆ తర్వాత గ్రాండ్గా తన వెడ్డింగ్ అనౌన్స్ చేసే విధంగా దేవిశ్రీప్రసాద్ ప్లాన్ చేసుకున్నారట . అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ దేవి ఓ ఇంటివాడు అవుతున్నాడన్న వార్తతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరీ పెళ్లి వార్తపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..






