
ధమాకా హీరోయిన్ శ్రీలీల ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాస్తోంది. తెరమీద హాట్ హీరోయిన్ గా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న భామ శ్రీలీల. పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఫరవాలేదనిపించుకుంది. ఇక ఇప్పుడేమో మాస్ మహారాజ్ రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించింది శ్రీలీల.
ధమాకా సినిమా రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ఇటీవలే ఓ ఊర మాస్ సాంగ్ రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని అంటారు సాధారణంగా. కానీ ఈ భామ మాత్రం డాక్టర్ అయి మరీ యాక్టర్ అయ్యింది. మెడిసిన్ ఫైనల్ ఇయర్ లో ఉంది. ప్రస్తుతం ముంబై లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దాంతో ఆ పరీక్షలకు అటెండ్ అవుతోంది. డాక్టర్ పట్టా పుచ్చుకోవాలనే కసిగా ఉంది శ్రీలీల. ఎగ్జామ్స్ అయ్యాక ….. ఫలితాలు వచ్చాక శ్రీలీల కాస్త డాక్టర్ శ్రీలీల కానుందన్నమాట.
ధమాకా రిలీజ్ కాకముందే బాలయ్య తో ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ భామ. అయితే హీరోయిన్ గా కాదు సుమా ! బాలయ్య కూతురుగా నటిస్తోంది. డిసెంబర్ 8 నే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బాలయ్య మీద మాత్రమే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. జనవరి నుండి శ్రీలీల జాయిన్ కానుంది.